PM Modi Degree Row: ప్రధాని మోదీ డిగ్రీ కేసు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్టే పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ప్రధాని మోదీ డిగ్రీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రధాని డిగ్రీకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ హైకోర్టు పరువు నష్టం చర్యలు తీసుకోకుండా స్టే విధించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది

Delhi CM arvind Kejriwal (Photo-ANI)

ప్రధాని మోదీ డిగ్రీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రధాని డిగ్రీకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ హైకోర్టు పరువు నష్టం చర్యలు తీసుకోకుండా స్టే విధించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.ప్రధాని డిగ్రీకి సంబంధించి తమ యూనివర్సిటీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు మరో ఆప్ నేత సంజయ్ సింగ్‌లపై గుజరాత్ యూనివర్సిటీ రిజిష్ట్రార్ పీయూష్ పటేల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో మధ్యంతర స్టే విధించాల్సిందిగా మొదట గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు గుజరాత్ హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున దీనిపై తాము ఎటువంటి నోటీసులు ఇవ్వలేమని చెబుతూ సంజీవ్ ఖన్నా, ఎస్‌విఎన్ భట్టిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అరవింద్ కేజ్రీవాల్, గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టుకు వివరణ ఇవ్వాలని తెలిపింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now