Pune Shocker: షాకింగ్ సీసీటీవీ పుటేజీ ఇదిగో, మహిళపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన దుండగులు

పూణెలోని చందన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరాడి ప్రాంతంలో వాహనాల పార్కింగ్‌ వివాదం నేపథ్యంలో మహిళను సజీవ దహనం చేసేందుకు (Gang Attempts To Burn Woman Alive) కొందరు వ్యక్తులు ప్రయత్నించారు.ఈ ఘటనలో ఆమె తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరుగులు తీసింది.

Fire (Representational Image; Photo Credit: IANS)

పూణెలోని చందన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరాడి ప్రాంతంలో వాహనాల పార్కింగ్‌ వివాదం నేపథ్యంలో మహిళను సజీవ దహనం చేసేందుకు (Gang Attempts To Burn Woman Alive) కొందరు వ్యక్తులు ప్రయత్నించారు.ఈ ఘటనలో ఆమె తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో దుండగులు ఆమె కారును ధ్వంసం చేయడంతో పాటు దానికి నిప్పంటించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ మహిళ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ముఖాలకు ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు కర్రలు చేతపట్టి బైక్‌పై ఆ మహిళ ఇంటికి చేరుకున్నారు. ఆమె కారును ధ్వంసం చేశారు. పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఇంటి నుంచి బయటకు వస్తున్న రాజేపై కూడ పెట్రోల్‌ పోసి సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించారు.ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now