Raghurama Krishna Raju: వీడియో ఇదిగో, రఘురామను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టిన చంద్రబాబు, చైర్ లోంచి లేచిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
రఘురామను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి హేమాహేమీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకునివెళ్లి కూర్చోబెట్టారు. వారి వెంట బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు.
రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. రఘురామను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వంటి హేమాహేమీలు చైర్ వద్దకు సగౌరవంగా తీసుకునివెళ్లి కూర్చోబెట్టారు. వారి వెంట బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చైర్ లోంచి లేచి రఘరామను కూర్చోబెట్టారు.
ఏపీ అసెంబ్లీ ఉప సభాపతిగా ఎన్నికైన రఘురామ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు, పవన్, అయ్యన్న శుభాకాంక్షలు తెలిపారు. ఇతర కూటమి ఎమ్మెల్యేలు చైర్ వద్దకు వెళ్లి రఘురామకు అభినందనలు తెలిపారు.అంతకుముందు, చైర్ వద్దకు వెళ్లే క్రమంలో రఘురామ... చంద్రబాబుకు పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ ను ఆత్మీయంగా హత్తుకుని హర్షం వ్యక్తం చేశారు.
Video Here
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)