Rajasthan Bus Fire: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం, నేషనల్ హైవేపై వెళ్తుండగా ఒక్కసారిగా ఎగసిన మంటలు, 15 మంది సజీవ దహనం అయినట్లుగా వార్తలు

రాజస్థాన్‌ (Rajasthan)లోని జైసల్మేర్‌ (Jaisalmer)లో మంగళవారం నాడు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో కదుపుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవరు అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేశారు.

The Jaisalmer-Jodhpur bus burst into flames in Jaisalmer (Photo Credits: X/@ANI)

రాజస్థాన్‌ (Rajasthan)లోని జైసల్మేర్‌ (Jaisalmer)లో మంగళవారం నాడు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో కదుపుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవరు అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేశారు. నేషనల్ హైవేపై ఈ ట్రావెల్ బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో కిలోమీటర్ల వరకూ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని అర్మీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి చుట్టుపక్కలకు మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య కాని, గాయపడిన వారిపై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. 15 మంది సజీవ దహనం అయినట్లు సమాచారం. అలాగే 25 మందికి గాయాలు అయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Jaisalmer-Jodhpur Bus Burst Into Flames

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement