Chennai Rains: రజనీకాంత్ ఇల్లు వరద నీటిలో ఎలా మునిగిపోయిందో వీడియో ఇదిగో, చెన్నై నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలు
ప్రస్తుతం వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ విలాసవంతమైన విల్లా నీటిలో ముగినింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆయన ఇంట్లోకి నీరు చేరింది. ప్రస్తుతం వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాలకు నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సూపర్‌స్టార్ రజనీ ఇంటి పరిసర ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరద ఉన్నది. స్థానిక అధికారులు వెంటనే నీటిని బయటకు తీసేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
రజనీకాంత్ ఇల్లు వరదలో చిక్కుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ చెన్నైలో వచ్చిన వరదల సమయంలోనూ ఇల్లు నీటమునిగింది. భారీ వర్షాలతో చెన్నైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. పలు సంస్థలు ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులకు సూచించాయి. వర్షాల నేపథ్యంలో చెన్నై కార్పొరేషన్ 1913 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది.
Here's Floods Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)