![](https://test1.latestly.com/uploads/images/2025/02/1-693307235.jpg?width=380&height=214)
Vijayawada, Feb 10: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత (Home Minister Anitha) మానవత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో (Road Accident) గాయపడ్డ యువతికి ఆమె స్వయంగా సపర్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం ఈరోజు శ్రీశైలంకు ప్రయాణమైంది. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, అనిత శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో హోంమంత్రి అనిత రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్తుండగా.. నర్సరావుపేట బైపాస్ రోడ్డులోని వై-జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం జరిగింది. దీన్ని గమనించిన అనిత వెంటనే కాన్వాయ్ ఆపి బాధితుల దగ్గరకు వెళ్లి యువతికి సపర్యలు చేశారు. బాధితురాలిని హుటాహుటిన వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అనిత ఔదార్యంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి కోసం కలలు కనడం తప్పా మీరు చేసింది ఏమిటీ ? సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన కురసాల కన్నబాబు
Here's Video:
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యలు
హోంమంత్రి అనిత రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్తుండగా.. నర్సరావుపేట బైపాస్ రోడ్డులోని వై-జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం
వెంటనే కాన్వాయ్ ఆపి బాధితుల దగ్గరకు వెళ్లి యువతికి సపర్యలు చేసిన అనిత… pic.twitter.com/UfNO8EmbTO
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2025
చంద్రబాబు అప్పుడు..
శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23న శ్రీశైలంకు వెళ్లనున్నారు. స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఎవరైనా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించేవారు. ఈసారి నేరుగా ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించనుండటం గమనార్హం.
హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (వీడియో)