Rajouri Terrorist Attack: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లే లక్ష్యంగా కాల్పులు, అదనపు బలగాలను తరలించిన భారత ఆర్మీ

జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.ఆర్మీ వాహనంపై (Terrorist attack on army vehicle) విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు.

Rajouri Terrorist Attack (photo-ANI)

జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.ఆర్మీ వాహనంపై (Terrorist attack on army vehicle) విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు.ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించినట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో సుందర్‌బని మల్లా రోడ్డు వద్ద ఫాల్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

మహాశివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు, ఒక్కరోజే కోటి మందికి పైగా పవిత్ర స్నానాలు, మరి కొన్ని గంటల్లో ముగియనున్న మహా కుంభమేళా

సుమారు రెండు రౌండ్లు ఫైరింగ్‌ జరిగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సరిహద్దు సమీపంలోని ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాట్లు సాధారణమని ఆర్మీ అధికారులు తెలిపారు. పెట్రోలింగ్ వాహనంపై కాల్పుల సంఘటన నేపథ్యంలో అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాదుల కోసం కూంబింగ్‌ జరుగుతున్నదని వెల్లడించారు. అటవీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు ఈ కాల్పులు జరిపారని చెప్పారు.

Rajouri Terrorist Attack:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now