ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు (Devotees) వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో కుంభ్‌ప్రాంతమంతా యాత్రికులతో కిటకిటలాడుతోంది. నేడు చివరి రోజు కావడంతో గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో చివరి అమృతస్నాన్‌ (holy dip) కోసం పోటెత్తుతున్నారు.

వీడియో ఇదిగో, భర్తకు వీడియో కాల్‌ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళ, కుంభమేళాలో ఆసక్తికర ఘటన

ఇవాళ ఉదయం 12 గంటల వరకూ దాదాపు కోటి మందికి పైగా భక్తులు నదీ స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.ఫిబ్రవరి 25 నాటికి ఆచార స్నానంలో పాల్గొన్న మొత్తం యాత్రికుల సంఖ్య 64.77 కోట్లను ఈ రోజు దాటింది. పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న మహాకుంభమేళా 45 రోజుల పాటు కొనసాగి నేడు శివరాత్రితో ముగియనుంది. కుభమేళాలో పుష్య పూర్ణిమ (జనవరి 13), మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 29), వసంత పంచమి (ఫిబ్రవరి 3), మాఘ పూర్ణిమ (ఫిబ్రవరి 12), మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) ప్రత్యేక తేదీలుగా ప్రకటించారు.

Over 1 Crore Devotees Take Holy Dip at Triveni Sangam As Final ‘Snan’ on Mahashivratri 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)