హీరోయిన్‌తో సెల్ఫీ కోసం ఉత్సాహం చూపించారు స్వామీజీలు. మహాశివరాత్రి (Mahashivratri)సందర్భంగా, బాలీవుడ్ నటి అమీషా పటేల్(Ameesha Patel) ముంబై జూహులోని శివాలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో శివుడిని ప్రార్థించడానికి ఆలయానికి వెళ్లారు. అభిమానులే కాదు సాధువులు గుంపుగా చేరి ఆమెతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో కంగారు పడింది అమీషా. సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు, దీంతో ఆలయంలో అశాంతి నెలకొంది.

ముంబైలోని జూహులోని శివాలయంలో(Shiva temple in Juhu) ఈ ఘటన జరిగింది. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో ఆలయ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. అమీషాను అక్కడి నుండి తీసుకెళ్లగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ధనుష్ కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్...అఫిషియల్‌గా ప్రకటించిన మేకర్స్, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం, నాగార్జున కీ రోల్

అయితే అభిమానులు చుట్టుముట్టినా అమీషా పటేల్ ధైర్యంగా తన ప్రార్థనలను కొనసాగించారు. ఆలయాన్ని విడిచిపెట్టే ముందు, భద్రతా సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా శివలింగం ముందు ప్రార్థిస్తున్న తన ఫోటోను షేర్ చేసి, “హర్ హర్ మహాదేవ్” అని వెల్లడించారు.

Ameesha Patel visits Shiva temple in Juhu

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)