యూపీ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ మహా కుంభమేళాలో ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు కౌంటర్ విసిరాయి. క్రికెటర్ పేరును కూడా యోగి ఆదిత్యనాథ్ మార్చినట్లు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. వాస్తవానికి మొహమ్మద్ షమీ (Mohammed Shami) కుంభమేళాలో పుణ్యస్నానం చేయలేదు.
మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ సంగమం వద్ద నదిలో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. అలహాబాద్, ఫైజాబాద్ వంటి అనేక నగరాలు, ల్యాండ్ మార్కుల పేర్లు మార్చిన యోగి ఆదిత్యనాథ్ తాజాగా క్రికెటర్ పేరును కూడా మార్చేశారని (Yogi Adityanath's Remarks Go Viral) ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు, మీరు ఒక క్రికెటర్ పేరు కూడా మారుస్తారా?’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
'Mohammed Shami Took Holy Dip During Maha Kumbh Mela in Prayagraj': Yogi Adityanath's Remarks
मुख्यमंत्री जी कृपया फेक न्यूज़ मत फैलाइए... pic.twitter.com/Ls10PtH3WX
— Amit Yadav (Journalist) (@amityadavbharat) February 19, 2025
अब क्या क्रिकेटर का भी नाम बदल दिया?
— Akhilesh Yadav (@yadavakhilesh) February 19, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)