ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు (Kumbh Mela) ఊహించని రీతిలో భక్తులు తరలివెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నాటికి 99.20 లక్షలకు పైగా భక్తులు సంగమ పవిత్ర జలాల్లో పవిత్ర స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ ప్రకారం, జనవరి 13 నుండి మహాకుంభ్‌లో స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్య 54.31 దాటింది.

మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు,

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కుటుంబసమేతంగా కుంభమేళాకు హాజరయ్యారు. భార్య, పిల్లలతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కూడా కుటుంబంతో కలిసి కుంభమేళాకు విచ్చేశారు. సింగర్‌ షాన్‌ కూడా కుటుంబసమేతంగా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం ఆచరించారు. వెంకయ్యనాయుడు, ప్రహ్లాద్‌ జోషి, షాన్‌ కుటుంబాలు పుణ్యస్నానాలు ఆచరించిన దృశ్యాలను కింది వీడియోల్లో మీరు కూడా చూడవచ్చు.

వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కుటుంబం పుణ్యస్నానాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)