Maha Shivaratri Celebrations 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు, ఉదయం నుండే మహాశివుని దర్శనం కోసం క్యూ

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి(Maha Shivaratri Celebrations 2025). పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

Maha Shivaratri Celebrations 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు, ఉదయం నుండే మహాశివుని దర్శనం కోసం క్యూ
Mahashivratri Celebrations 2025 at Telugu states(X)

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి(Maha Shivaratri Celebrations 2025). పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మహా శివరాత్రి సందర్భంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అలాగే కీసరగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శనానికి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.

మీ స్నేహితులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా సోషల్ మీడియాలో సులభంగా తెలియజేయండిలా.. 

ఏ శైవక్షేత్రం చూసినా సరే భక్తుల క్యూలైన్​లతో కనిపిస్తోంది. మహా శివరాత్రి నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ నుండి వేములవాడ, కీసరతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు వేశారు ఆర్టీసీ అధికారులు.

Mahashivratri Celebrations 2025 at Vemulawada

Mahashivratri Celebrations 2025 at Telugu states

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 26, 2025 08:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).