మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సు హైవేపై ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కి చెందినవాళ్లుగా తెలుస్తోంది. మహా కుంభమేళాకు వెళ్లి వస్తుండగా.. జబల్‌పూర్‌(Jabalpur) సిహోరా దగ్గర మంగళవారం ఉదయం ఈ ఘోరం చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

షాకింగ్ వీడియో ఇదిగో, సరదా కోసం స్టంట్ చేసి ప్రాణాలు కోల్పోయిన యువకుడు, బ్యాలన్స్ తప్పి మెడ ఎముక విరిగిపోవడంతో తిరిగిరాని లోకాలకు..

మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిహోరా (Sihora) పట్టణానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ట్రక్కు రాంగ్‌ సైడ్‌ నుంచి హైవేపై వెళ్తుండటంతో ప్రమాదానికి దారి తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జబల్‌పూర్‌ కలెక్టర్‌, పోలీసు సూపరింటెండెంట్‌ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

7 Killed After Andhra Pradesh Bus Returning From Prayagraj Collides With Truck

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)