మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన ఒక యువకుడు సరదా కోసం స్టంట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. అందరి ముందు స్టంట్ చేస్తుండగా అతని మెడ ఎముక విరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు కొంతమంది కూర్చుని ఉండగా సరదాగా స్టంట్ చేశాడు. ఓ సారి చేసిన తర్వాత మళ్లీ స్టంట్ కోసం బట్టలు కింద ఎక్కువగా వేసుకున్నాడు. అనంతం ఒక్కసారిగా స్టంట్ చేశాడు.
అయితే అది బ్యాలన్స్ తప్పి మెడ ఎముక విరిగిపోవడంతో అలానే పడిపోయాడు. ఎంత సేపటికి అతనే లేవకపోవడంతో అక్కడున్నవారు లేపే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియోని బాబా బనారస్ అనే యూజర్ తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇలా చేయకండి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు అంటూ యూజర్ ట్వీట్ చేశాడు.
young man did stunt for fun and lost his life
A young man from Neemuch district of Madhya Pradesh did stunt for fun and lost his life. His neck bone was broken. Don't do this. Small precautions may save your life. pic.twitter.com/0fBYyi6WOs
— Baba Banaras™ (@RealBababanaras) February 10, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)