ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలడంతో రహదారిపై కారు ఆరుసార్లు పల్టీలు కొట్టింది.అదృష్టవశాత్తు అందులో ప్రయాణించిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఫిబ్రవరి 6న ఢిల్లీ నుంచి బెగుసరాయ్‌కు వెళ్తున్న స్కార్పియో కారు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళుతుండగా..కాశీమాబాద్ ప్రాంతంలోని రహదారిలో కారు ముందు టైర్‌ పేలింది. అదుపుతప్పిన ఆ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు మధ్యలో ఆరుసార్లు పల్టీలుకొట్టింది.

వీడియోలు ఇవిగో, ప్రయాగ్ రాజ్‌లో సుమారు 300 కిలోమీటర్ల మేర నిలిపోయిన వాహనాలు, ఆకలిదప్పులతో ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు

చివరకు డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.ఆ సమయంలో కారులో ప్రయాణించిన నలుగురు పిల్లలతో సహా ఏడుగురు అదృష్టవశాత్తు ఈ యాక్సిడెంట్‌ నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Scorpio Flips 6 Times After Tyre Burst In UPगाजीपुर: टायर फटने से स्कॉर्पियो डिवाइडर से टकराई

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)