ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతుండటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది . సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికార వర్గాల నుంచి సమాచారం.హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ కదలడంలేదని, ప్రయాగ్ రాజ్ ఇంకా 300 కిలోమీటర్ల దూరం ఉందని ఓ వాహనదారుడు చెప్పారు. మరోవైపు, భక్తుల రద్దీ కారణంగా సంగం రైల్వే స్టేషన్ ను అధికారులు వచ్చే శుక్రవారం వరకు మూసివేశారు.

దారుణం, నడిరోడ్డు మీద యువతిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టిన యువకుడు, వీడియో ఇదిగో..

యూపీ సర్కారు వైఫల్యం వల్లే కుంభమేళాకు వెళుతున్న భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. హైవేపై ట్రాఫిక్ జామ్ వీడియోను షేర్ చేస్తూ... దీనికి సీఎం యోగి అసమర్థతే కారణమని మండిపడ్డారు. ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిచోట వాహనాల రద్దీ నెలకొనడంతో భక్తులకు ఆహార ధాన్యాలు, కూరగాయలు, ఔషధాలు, పెట్రోల్‌, డీజిల్‌ వంటివి అందటంలేదని, ఆహారం, విశ్రాంతి లేక భక్తులు నీరసించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Prayagraj Traffic Update:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)