Ratan Tata Dies: భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం రతన్ టాటా, దిగ్గజ వ్యాపారవేత్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్
టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షడు (BRS Chief), తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) సంతాపం (condolence) వ్యక్తం చేశారు.
Vjy, Oct 10: టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షడు (BRS Chief), తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) సంతాపం (condolence) వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని, సమాజ హితుడుగా.. తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం, పద్మ విభూషణ్ రతన్ టాటా అని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా అని కేసీఆర్ కొనియాడారు.
రతన్ టాటా అస్తమయం..శోకసంద్రంలో వ్యాపార ప్రపంచం..భారత కార్పోరేట్ యుగంలో ముగిసిన రతన్ టాటా శకం..
Here's BRS Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)