RBI: ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఆర్‌బీఐ భారీ షాక్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా
రెగ్యులేటరీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా విధించింది.
RBI imposes Penalties on ICICI Bank & Kotak Mahindra Banks: ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకులైన ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ఆర్‌బీఐ భారీ షాకిచ్చింది. రెగ్యులేటరీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా విధించింది.
లోన్ అడ్వాన్స్‌లు చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు; మోసాల వర్గీకరణ, కమర్షియల్ బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అయితే, ఈ పెనాల్టీకి బ్యాంకుల కస్టమర్లకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్‌బీఐ స్పష్టంచేసింది. కాగా, ఇటీవల కేవైసీ నిబందల్ని పాటించడంలో విఫలమైందంటూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రూ.5.39 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
Here's PTI News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)