RBI Repo Rate Update: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ, 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతున్న రెపోరేటు

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ‘ఆర్బీఐ(RBI)’ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన (RBI Monetary Policy) కమిటీ సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించారు.

Rbi Governor (Photo-ANI)

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ‘ఆర్బీఐ(RBI)’ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన (RBI Monetary Policy) కమిటీ సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించారు. కాగా  కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఐదోసారి.

2023 సంవత్సరం ముగింపునకు వచ్చిన వేళ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం (Inflation) తగ్గుముఖం పడుతోంది. కానీ, ఆహార ద్రవ్యోల్బణంలో మాత్రం రిస్క్‌ ఇంకా కొనసాగుతోంది. దేశ జీడీపీ (GDP) వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంపు ఉంటుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now