Republic Day 2024: దేశ చరిత్రలో తొలిసారిగా నారీ శక్తి పేరుతో పరేడ్ నిర్వహించిన మహిళా సైనికులు, పురుషుల పరేడ్‌కు నాయకత్వం వహించిన 31 ఏళ్ల మేజర్‌ దివ్య త్యాగి, వీడియో ఇదిగో..

దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు (Republic Day) అంబరాన్ని తాకాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత రిపబ్లిక్‌ డే పరేడ్‌ (Parade) నిర్వహించారు. ఈ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Delhi Police all-women band participates in Republic Day 2024: Photo Credit: ANI)

దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు (Republic Day) అంబరాన్ని తాకాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత రిపబ్లిక్‌ డే పరేడ్‌ (Parade) నిర్వహించారు. ఈ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన నారీమణులు.. మన సైనిక శక్తిని చాటిచెప్పారు. ఎయిర్‌ఫోర్స్‌ మార్చ్‌కు స్క్వాడ్రన్‌ లీడర్లు రష్మీ ఠాకుర్‌, సుమితా యాదవ్‌, ప్రతిథి అహ్లువాలియా, ఫ్లైట్ లెఫ్టినెంట్‌ కిరిట్‌ రొహైల్‌ నేతృత్వం వహించారు.

260 మంది సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ మహిళా సైనికులు ‘నారీ శక్తి’ పేరుతో విన్యాసాలు చేశారు. తొలిసారి బీఎస్‌ఎఫ్‌ మహిళా బ్రాస్‌ బ్యాండ్‌ ఈ పరేడ్‌లో పాల్గొంది. 300 ఏళ్ల బాంబే శాపర్స్‌ రెజిమెంట్‌ చరిత్రలో తొలిసారిగా అందరూ పురుషులే ఉన్న బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించారు. 31 ఏళ్ల మేజర్‌ దివ్య త్యాగికి ఈ అవకాశం దక్కింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now