Robbery at Gunpoint in Delhi Video: వీడియో ఇదిగో, కారును అడ్డగించి రూ. 2 లక్షలకు దోచుకున్న బైకర్స్, ఎల్జీ వీకే సక్సేనా రాజీనామా చేయాలని సీఎం కేజ్రీవాల్ డిమాండ్

న‌లుగురు వ్య‌క్తులు రెండు బైక్‌లో వెంబ‌డించారు. ఆ కారును అడ్డుకున్న ఆ బైక‌ర్లు.. ఆ త‌ర్వాత త‌మ వ‌ద్ద ఉన్న గ‌న్‌తో బెదిరించి.. కారులో నుంచి 2 ల‌క్ష‌ల న‌గ‌దు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. ట‌న్నెల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల‌కు ఈ ఘ‌ట‌న చిక్కింది.

Goons Rob Delivery Agents on Gunpoint Video (Photo Credit: Twitter/ @ANI)

ఢిల్లీ(Delhi)లో ప్ర‌గ‌తి మైదాన్ ట‌న్నెల్‌లో కారులో వెళ్తున్న ఓ డెలివ‌రీ ఏజెంట్‌ను .. న‌లుగురు వ్య‌క్తులు రెండు బైక్‌లో వెంబ‌డించారు. ఆ కారును అడ్డుకున్న ఆ బైక‌ర్లు.. ఆ త‌ర్వాత త‌మ వ‌ద్ద ఉన్న గ‌న్‌తో బెదిరించి.. కారులో నుంచి 2 ల‌క్ష‌ల న‌గ‌దు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. ట‌న్నెల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల‌కు ఈ ఘ‌ట‌న చిక్కింది.

గురుగ్రామ్‌లో క్యాష్ బ్యాగును డెలివ‌రీ చేసేందుకు వెళ్తున్న ఇద్ద‌ర్ని దుండ‌గులు వెంటాడిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప‌ట్ట‌ప‌గ‌లే ఈ చోరీ జ‌రిగింది. ఓలా క్యాబ్‌లో వెళ్తున్న డెలివ‌రీ బాయ్ త‌న కారును రెడ్ ఫోర్ట్ ఏరియాలో బుక్ చేసుకున్నాడు. అయితే రింగు రోడ్డు వ‌ద్ద ఉన్న ట‌న్నెల్‌లోకి రాగానే రెండు బైక్‌ల‌పై వ‌స్తున్న న‌లుగురు అడ్డుకున్నారు. ప్రగతి మైదాన్ టన్నెల్ సర్ఫేస్ లోపల డెలివరీ ఏజెంట్లను దోచుకుంటున్న సాయుధుల సీసీటీవీ ఫుటేజీకి సంబంధించి ఎల్జీ వీకే సక్సేనా రాజీనామా చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు