Rupee vs Dollar: డాలర్‌తో పోలిస్తే రూపాయి ఖరీదు ఇప్పుడెంతో తెలుసా ? డిసెంబర్ 31, 2014 నుండి రూపాయి దాదాపు 25 శాతం క్షీణించిందని తెలిపిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
డాలరుతో పోలిస్తే తొలిసారి 80కి చేరుకుంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 79.9863 వద్ద ప్రారంభమై తర్వాత యుఎస్ డాలర్‌తో రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 80.05 నమోదు చేసింది.
దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి పాతాళానికి పడిపోయింది. డాలరుతో పోలిస్తే తొలిసారి 80కి చేరుకుంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 79.9863 వద్ద ప్రారంభమై తర్వాత యుఎస్ డాలర్‌తో రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 80.05 నమోదు చేసింది. ఇంట్రా-డే రికార్డు కనిష్ట స్థాయి 80.0175ని తాకింది. సోమవారం 79.97 వద్ద ముగిసింది. మరోవైపు డిసెంబర్ 31, 2014 నుండి భారత రూపాయి దాదాపు 25 శాతం క్షీణించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు చెప్పారు. రూపాయి విలువ 63.33 నుండి జూలై 11, 2022 నాటికి 79.41కి తగ్గిందని ఆర్‌బిఐ డేటాను ఉటంకిస్తూ లోక్‌సభకిచ్చిన ఒక రాతపూర్వక సమాధానంలో తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)