Russia-Ukraine War: 249 మంది ప్రయాణికులతో బుకారెస్ట్‌ నుంచి ఢిల్లీకి చేరిన ఐదో విమానం, కొనసాగుతున్న భారతీయుల తరలింపు ప్రక్రియ, ఉక్రెయిన్‌లో 13వేల మంది భారతీయులు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్‌ గంగ (Operation Ganga) పేరుతో చేపట్టిన తరలింపు ప్రక్రియ భాగంగాలో ఐదో విమానం ఢిల్లీకి చేరుకున్నది. 249 మంది భారతీయులతో కూడిన ఎయిర్‌ ఇండియా విమానం రొమేనియాలోని బుకారెస్ట్‌ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో దిగింది.

Stranded Indians (Photo Credits: Twitter@DrSJaishankar)

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్‌ గంగ (Operation Ganga) పేరుతో చేపట్టిన తరలింపు ప్రక్రియ భాగంగాలో ఐదో విమానం ఢిల్లీకి చేరుకున్నది. 249 మంది భారతీయులతో కూడిన ఎయిర్‌ ఇండియా విమానం రొమేనియాలోని బుకారెస్ట్‌ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో దిగింది. శనివారం బుకారెస్ట్‌ నుంచి మొదటి విమానంలో 219 మంది ముంబై ఎయిర్‌పోర్టుకు, ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు 250 మందితో కూడిన రెండో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నది. మరో రెండు విమానాల్లో కూడా భారతీయులను తరలించారు. ఇప్పుడు ఐదో విమానం ఢిల్లీకి వచ్చింది. ఉక్రెయిన్‌లో 13వేల మంది భారతీయులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now