Samvidhaan Hatya Diwas: కేంద్రం సంచలన ప్రకటన, ఏటా జూన్ 25ని సంవిధాన్‌ హత్యా దివస్‌గా పాటించాలని పిలుపు, ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజే అది..

1975 జూన్ 25న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును ఇకపై ఏటా సంవిధాన్‌ హత్యా దినంగా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు జూన్ 25ను సంవిధాన్‌ హత్యా దివస్‌గా కేంద్రం ప్రకటించింది

Amit Shah (Photo-ANI)

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 1975 జూన్ 25న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును ఇకపై ఏటా సంవిధాన్‌ హత్యా దినంగా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు జూన్ 25ను సంవిధాన్‌ హత్యా దివస్‌గా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది.ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి దేశంలో చీకటి అధ్యాయానికి తెరలేపారని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు వీలుచిక్కినప్పుడల్లా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.  ఢిల్లీ మద్యం పాలసీ కేసు, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు మధ్యంతర బెయిల్, కేసు విచారణ ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ

Here's Amit Shas Tweets