Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, భారత యాత్రికుల బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్, 45 మంది సజీవ దహనం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో 45 మంది సజీవ దహనమయ్యారు.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో 45 మంది సజీవ దహనమయ్యారు.ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ అవసరమైన సహాయం అందిస్తాయని వెల్లడించారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు.
PM Modi Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)