PM Modi Security Breach: వీడియో ఇదిగో, ప్రధాని పర్యటనలో మళ్లీ భద్రతా వైఫల్యం, బారికేడ్లను దూకి మోదీ కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన యువకుడు, అలర్ట్ అయిన పీఎం సిబ్బంది

ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. ఓ యువకుడు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు ఎదురొచ్చే యత్నం చేశాడు . అయితే.. అది గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

A screengrab of the video. (Photo credits: Twitter/ANI)

ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటనలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. ఓ యువకుడు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌కు ఎదురొచ్చే యత్నం చేశాడు . అయితే.. అది గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దావణగెరెలో ప్రధాని మోదీ రోడ్‌షో లో ప్రజలకు అభివాదం చేస్తూ వాహనంలో ముందుకు కదిలారు.

ఆ సమయంలో బారికేడ్లను దూకేసిన ఓ యువకుడు ప్రధాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ వైపు అకస్మాత్తుగా దూసుకొచ్చే యత్నం చేశాడు. అది గమనించిన స్థానిక పోలీసులు, పీఎం సెక్యూరిటీ సిబ్బంది.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిది కొప్పాల్‌ అని, అతడు బీజేపీ కార్యకర్తగానే గుర్తించారు పోలీసులు. ఈ ఏడాది జనవరిలో ఇదే కర్ణాటకలో హుబ్బళి వద్ద ప్రధాని మోదీ రోడ్‌షోలో.. ఇలాగే ఓ వ్యక్తి దూసుకొచ్చే యత్నం చేయగా, పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు.

Here's Video

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement