Sex with Minor Wife Amounts to Rape: మైనర్ భార్యతో సెక్స్ రేప్ కిందనే లెక్క.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
ఈ మేరకు బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ సంచలన తీర్పు చెప్పింది. శృంగారానికి అంగీకారం తెలిపేందుకు కనీస వయసు 18 ఏండ్లు ఉండాలని ఈ సందర్భంగా కోర్టు పేర్కొన్నది.
Newdelhi, Nov 16: మైనర్ భార్యతో (Minor Wife) శృంగారంలో పాల్గొనడం అత్యాచారం (Rape) కిందకే వస్తుంది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ సంచలన తీర్పు చెప్పింది. శృంగారానికి అంగీకారం తెలిపేందుకు కనీస వయసు 18 ఏండ్లు ఉండాలని ఈ సందర్భంగా కోర్టు పేర్కొన్నది. మహారాష్ట్రలోని వార్దాకు చెందిన ఓ వ్యక్తి(24)పై మైనర్ అయిన అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు అతడికి పదేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)