Udaipur beheading: ఇస్లాంను ఆ ఉన్మాదులు చదివుంటే ఈ ఘాతుకానికి పాల్పడే వారు కాదు, తల నరికివేత ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపిన ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్‌ను ఇద్దరు ముస్లిం వ్యక్తులు కిరాతకంగా చంపడాన్ని షాహీ ఇమామ్ ఖండించారు. ఈ హత్యా ఘటనకు సంబంధించి ఢిల్లీలోని జామా మసీదుకు చెందిన షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఇవాళ ప్రకటన రిలీజ్ చేశారు. తల నరికివేత ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్‌ను ఇద్దరు ముస్లిం వ్యక్తులు కిరాతకంగా చంపడాన్ని షాహీ ఇమామ్ ఖండించారు. ఈ హత్యా ఘటనకు సంబంధించి ఢిల్లీలోని జామా మసీదుకు చెందిన షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఇవాళ ప్రకటన రిలీజ్ చేశారు. తల నరికివేత ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అది పిరికిపంద చర్య అని, ఇస్లామ్‌కు వ్యతిరేకమని ఆయన తన ప్రకటనలో తెలిపారు. గుండె పగిలేలా ఉన్న ఉదయ్‌పూర్ ఘటన యావత్ మానవాళిని కలిచివేసిందన్నారు.
భారతీయ ముస్లింల తరపున ఆ ఘటనను ఖండిస్తున్నట్లు షాహీ ఇమామ్ తెలిపారు.ఇస్లాం మతం శాంతికి, సౌభాతృత్వానికి చిహ్నమన్నారు. ప్రేమ, సహనం, ఔదార్యం, మానవత్వానికి మహమ్మద్ ప్రవక్త జీవితం నిదర్శనం అన్నారు. ప్రవక్త జీవితాన్ని కానీ, పవిత్ర ఖురాన్‌ను కానీ, షరియత్‌ను కానీ ఒకవేళ ఆ ఉన్మాదులు చదివి ఉంటే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండేవారు కాదని షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తన ప్రకటనలో తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)