MUDA Land Case: ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, బుధవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపిన లోకాయుక్త పోలీసులు

కర్ణాటక మైసూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ (MUDA) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లోకాయుక్త పోలీసులు విచారణకు పిలిచారు.ఇందులో భాగంగానే ఆయనకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Siddaramaiah (Photo-ANI)

కర్ణాటక మైసూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ (MUDA) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లోకాయుక్త పోలీసులు విచారణకు పిలిచారు.ఇందులో భాగంగానే ఆయనకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు.బుధవారం (నవంబర్‌ 6) ఉదయం సీఎం సిద్ధరామయ్య తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో కోరినట్లు లోకాయుక్త సీనియర్ అధికారి తెలిపారు.

ముడా కుంభకోణంలో క‌ర్నాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌కు షాక్, విచారణకు కర్ణాటక హైకోర్టు ఆమోదం, చట్ట ప్రకారం విచారించవచ్చని తీర్పు

దీనిపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ..ముడాకు సంబంధించి మైసూర్ లోకాయుక్త పోలీసులు నోటీసు జారీ చేశారు. నవంబర్ 6న మైసూర్ లోకాయుక్తకు వెళ్లుతా’ అని అన్నారు.ఇదే కేసులో ఇటీవల సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి లోకాయుక్త ప్రశ్నించిన విషయం తెలిసిందే.సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో మైసూరులోని లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Telangana: సివిల్ వ్యవహారంలో తలదూర్చిన ఎస్‌ఐ బొరగాల అశోక్.. బాధితుడిని బండబూతులు తిట్టిన వైనం, ఎస్ఐ అశోక్‌పై ఎంక్వైరీ చేయాలని కమిషనర్ ఆదేశం

Supreme Court: నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Bengaluru Horror: దారుణం, మదర్సాలో బాలుడిపై టీచర్ పదే పదే అత్యాచారం, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు, చివరకు తల్లిదండ్రులకు ఘోరాన్ని చెప్పిన బాలుడు

Andhra Pradesh Horror: పల్నాడు జిల్లాలో దారుణం, తండ్రి వృద్ధుడు అయ్యాడని కాలువలో తోసిన కొడుకు, భార్య పోరు పడలేక అలా చేశానని పోలీసులకు వాంగ్మూలం

Share Now