Six Cubs Born to Cheetah Gamini: ఆరు కూనలకు జన్మనిచ్చిన దక్షిణాఫ్రికా చిరుత గామిని, వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్
దక్షిణాఫ్రికానుంచి తెప్పించిన ఆడ చిరుత గామిని (Gamini) ఇటీవలే ఐదు పిల్లలకు (Cheetah cubs) జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే గామిని ఐదు పిల్లలకు కాదు, ఆరు పిల్లలకు జన్మనిచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) సోమవారం ఉదయం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఈ చిరుత ఆరు కూనలకు జన్మనిచ్చినట్లు తెలిపారు
దక్షిణాఫ్రికానుంచి తెప్పించిన ఆడ చిరుత గామిని (Gamini) ఇటీవలే ఐదు పిల్లలకు (Cheetah cubs) జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే గామిని ఐదు పిల్లలకు కాదు, ఆరు పిల్లలకు జన్మనిచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) సోమవారం ఉదయం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కునో నేషనల్ పార్కులో ఐదు చీతాలకు జన్మనిచ్చిన గామిని, మొత్తం 26కు చేరిన చీతాల సంఖ్య (ఫోటోలు, వీడియో ఇదుగోండి)
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఈ చిరుత ఆరు కూనలకు జన్మనిచ్చినట్లు తెలిపారు.ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు.గామిని భారత్‌లో ప్రసవించిన నాలుగో విదేశీ చిరుతగా, తొలి దక్షిణాఫ్రికా చిరుతగా గుర్తింపు పొందింది. ఈ చిరుత ఆరు కూనలకు జన్మనివ్వడంతో.. భారత్‌లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 14కు పెరిగినట్లైంది.గామిని కొత్తగా ఆరు కూనలకు జన్మనివ్వడంతో కునో నేషనల్ పార్కులో మొత్తం చిరుత పులుల సంఖ్య 27కు పెరిగింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)