Jharkhand: కరెంటు పోల్ నిలబెడుతుండగా ఆరుమందికి విద్యుత్ షాక్, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కూలీలు, జార్ఖండ్‌లో విషాదకర ఘటన
జార్ఖండ్‌లో కరెంటు పోల్ నిలబెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేకు చెందిన ధన్‌బాద్ డివిజన్ పరిధిలోని నిచిత్‌పూర్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
జార్ఖండ్‌లో కరెంటు పోల్ నిలబెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేకు చెందిన ధన్‌బాద్ డివిజన్ పరిధిలోని నిచిత్‌పూర్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్ దగ్గర ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ (OHE) పోల్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు పలువురికి విద్యుత్ షాక్ తగిలిందని, వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని రైల్వే అధికారులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన విద్యుత్ శాఖ అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. రైల్వే అధికారుల ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)