'No Special Category Status For Bihar': నితీష్ కుమార్‌కి షాకిచ్చిన ఎన్డీయే కూటమి, బీహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని స్పష్టం

ఎన్డీయే కూటమిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న బిహార్‌ అధికార పార్టీ జేడీయూకి ఎన్డీయే కూటమి షాకిచ్చింది. బీహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని కేంద్రం పార్లమెంట్‌ వేదికగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పార్లమెంట్‌లో స్పందించింది

Prime Minister Narendra Modi and Bihar CM Nitish Kumar. (PTI)

ఎన్డీయే కూటమిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న బిహార్‌ అధికార పార్టీ జేడీయూకి ఎన్డీయే కూటమి షాకిచ్చింది. బీహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని కేంద్రం పార్లమెంట్‌ వేదికగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పార్లమెంట్‌లో స్పందించింది. బీహార్‌కు స్పెషల్‌ స్టేటస్‌పై కేంద్రం స్పందిస్తూ అధికారికంగా ఓ నోట్‌ను విడుదల చేసింది. అందులో లోక్‌సభలో బిహార్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.  ఆర్థిక సర్వే హైలెట్స్ ఇవిగో, వ్యవసాయంపై మరింత దృష్టి సారించాలని తెలిపిన కేంద్ర మంత్రి, ఎఫ్‌వై24లో 5.4 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

అందులో 2012లో ఇంటర్ మినిస్ట్రీ రియల్ గ్రూప్ బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించింది. అయితే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిర్దేశించిన ప్రమాణాలలో బిహార్‌ అర్హత సాధించలేదని స్పష్టం చేసింది. ఇక ప్రత్యేక హోదా సాధించాలంటే కావాల్సిన అర్హతల గురించి పంకజ్ చౌదరి లేఖలో ప్రస్తావించారు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రకారం స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలంటే..

పర్వత ప్రాంత రాష్ట్రం అయి ఉండాలి.

తక్కువ జనాభా,ఎక్కువ గిరిజన ప్రాంతాలు ఉండాలి.

అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండాలి

ఆర్థిక మౌలిక వసతుల లేమి కలిగిన రాష్ట్రమై ఉండాలి

అత్యల్ప ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు అర్హులని తెలిపింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement