SpiceJet Flight: ఢిల్లీలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్పైస్‌జెట్ విమానం, వెంటనే ప్రయాణికులను దింపేసిన సిబ్బంది, ప్రత్యామ్నాయ విమానంలో జమ్మూకు తరలించిన అధికారులు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను విమానం దింపి, మరో విమానంలో తరలించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను విమానం దింపి, మరో విమానంలో తరలించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. ఎస్‌జీ160 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లాల్సి ఉన్నది. ప్రయాణికుల విమానం ఎక్కిన తర్వాత.. పుష్ బ్యాక్ చేస్తున్న సమయంలో విమానం కుడి వైపు రెక్క విద్యుత్ స్తంభాన్ని తాకడంతో దెబ్బతిన్నది. దీంతో వెంటనే ప్రయాణికులను అందులో నుంచి దింపి.. మరో ప్రత్యామ్నాయ విమానంలో జమ్మూకు తరలించినట్లు స్పైస్‌సెట్ ప్రతినిధి వివరించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)