Stunt Gone Wrong: షాకింగ్ వీడియో ఇదిగో, ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తూ అదే ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన స్టంట్‌మ్యాన్
పంజాబ్ రాష్ట్రంలో ట్రాక్టర్ చక్రాల కింద నలిగి స్టంట్‌మ్యాన్ (Stuntman) ప్రాణాలు కోల్పోయాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.గురుదాస్‌పుర్ జిల్లాలో ఇటీవలే గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహించారు.
పంజాబ్ రాష్ట్రంలో ట్రాక్టర్ చక్రాల కింద నలిగి స్టంట్‌మ్యాన్ (Stuntman) ప్రాణాలు కోల్పోయాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.గురుదాస్‌పుర్ జిల్లాలో ఇటీవలే గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తాతే గ్రామానికి చెందిన సుఖ్‌మన్‌దీప్ సింగ్ (Sukhmandeep Singh) అనే 29 ఏళ్ల స్టంట్‌మ్యాన్ పాల్గొన్నాడు. అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మైదానంలో తన ట్రాక్టర్‌తో విన్యాసాలు ప్రదర్శించాడు. ట్రాక్టర్ ముందు చక్రాలను గాల్లోకి లేపి కిందకి దిగాడు.
కాసేపటి తర్వాత ట్రాక్టర్ మైదానంలో చుట్టూ తిరుగుతుండగా.. సుఖ్‌మన్ ట్రాక్టర్ వెనుక టైర్‌పై కాలు పెట్టి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి ట్రాక్టర్ వెనుక చక్రాల కింద (tractor wheels ) పడిపోయాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సుఖ్‌మన్.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)