BJP MP Hema Malini: నా బుగ్గల గురించి లాలూ మొదలు పెట్టారు, అదే సాంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారు, అటువంటి వ్యాఖ్యలను పట్టించుకోనని తెలిపిన హేమమాలిని
మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత గులాబ్ రావ్ పాటిల్ హేమమాలిని బుగ్గలపై చేసిన వ్యాఖ్యలకు హేమమాలిని ( Hema Malini ) స్పందించారు. రోడ్లను నటీమణుల బుగ్గలతో పోల్చే సాంప్రదాయాన్ని గతంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ మొదలుపెట్టారని ఆమె గుర్తుచేశారు.
మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత గులాబ్ రావ్ పాటిల్ హేమమాలిని బుగ్గలపై చేసిన వ్యాఖ్యలకు హేమమాలిని ( Hema Malini ) స్పందించారు. రోడ్లను నటీమణుల బుగ్గలతో పోల్చే సాంప్రదాయాన్ని గతంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ మొదలుపెట్టారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారన్నారు. అయితే ఇలాంటి కామెంట్‌లు మంచివి కావని హేమమాలిని (BJP MP Hema Malini) వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజలు ఇలాంటి కామెంట్లు చేస్తే పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదని, కానీ గౌరవ హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని అన్నారు. మీ బుగ్గలపై కామెంట్ చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను (Maharashtra minister Gulabrao Patil) క్షమాపణ కోరుతారా..? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను ఆ వ్యాఖ్యలను పట్టించుకోనని హేమమాలిని స్పష్టంచేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)