Rape Survivor: సుప్రీంకోర్టు సంచలన తీర్పు, అత్యాచార బాధితురాలి ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు అనుమతి
సుప్రీంకోర్టు(Supreme Court) గర్భవతి అయిన ఓ అత్యాచార బాధితురాలికి ఊరట కల్పించింది. ప్రెగ్నెన్సీని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది.
సుప్రీంకోర్టు(Supreme Court) గర్భవతి అయిన ఓ అత్యాచార బాధితురాలికి ఊరట కల్పించింది. ప్రెగ్నెన్సీని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందని, గర్భాన్ని దాల్చడం దంపతులకు సంతోషకరమైన అంశమని, సమాజానికి కూడా అది మంచి సంకేతాన్ని ఇస్తుందని, కానీ వివాహం కాని వారు గర్భాన్ని దాల్చడం వల్ల అది ఆ మహిళ మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని కోర్టు తన తీర్పులో తెలిపింది.
ఈ కేసులో ఆగస్టు 20లోగా వైద్య నివేదిక ఇవ్వాలని గత విచారణలో సుప్రీంకోర్టు పేర్కొన్నది. గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి నిరాకరించిన గుజరాత్ హైకోర్టు తీర్పును కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇలాంటి కేసుల్లో కొంత వేగాన్ని చూపాలని సుప్రీం అభిప్రాయపడింది. నిర్లక్ష్యపూరిత వైఖరి సరికాదు అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
Here's News