Ganesh Chaturthi: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ థీమ్‌తో వినాయక మండపం, ప్రతీ క్షణాన్ని రీక్రియేట్‌ చేసినట్టుగా మండపం, ఫోటో సోషల్ మీడియాలో వైరల్

ఈ మూమెంట్‌కు సంబంధించిన థీమ్‌తో వాపిలో రూపొందించిన వినాయక మండపం భక్తులను విశేషంగా అలరిస్తోంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురు, భారత ఫీల్డర్లు ఆసక్తిగా చూస్తుండటం, స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకుల కేరింతలు… ఇలా ప్రతీ క్షణాన్ని రీక్రియేట్‌ చేసినట్టుగా మండపాన్ని మలచడం విశేషం. దీన్నంతటినీ పై నుంచి వినాయకుడు కుర్చీలో కూర్చుని చూస్తున్నట్టుగా రూపొందించారు.

Suryakumar Yadav's iconic catch transformed to ganesh pandal (Photo Credits: @RAnugrah707/X)

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య బార్బడోస్‌ (వెస్టిండీస్‌) వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం కాగా హార్దిక్‌ పాండ్యా వేసిన ఫుల్‌టాస్‌ బంతిని షాట్‌ ఆడబోయిన డేవిడ్‌ మిల్లర్‌ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాఫ్‌ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చి బౌండరీ లైన్‌ దగ్గర  సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌ గురించి భారత క్రికెట్ అభిమానులు ఇప్పట్లో మరిచిపోలేరు. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్‌ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి

తాజాగా ఈ మూమెంట్‌కు సంబంధించిన థీమ్‌తో వాపిలో రూపొందించిన వినాయక మండపం భక్తులను విశేషంగా అలరిస్తోంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురు, భారత ఫీల్డర్లు ఆసక్తిగా చూస్తుండటం, స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకుల కేరింతలు… ఇలా ప్రతీ క్షణాన్ని రీక్రియేట్‌ చేసినట్టుగా మండపాన్ని మలచడం విశేషం. దీన్నంతటినీ పై నుంచి వినాయకుడు కుర్చీలో కూర్చుని చూస్తున్నట్టుగా రూపొందించారు. అంతేగాక పైన రోహిత్‌ శర్మ.. టీ20 ప్రపంచకప్‌ అందుకున్న ఫోటోను ఉంచడం ఫ్యాన్స్‌ను విశేషంగా అలరిస్తోంది.

Here's Pic

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now