Sushil Kumar Modi Cancer Diagnosis: గత ఆరు నెలల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్న సుశీల్ కుమార్ మోదీ, లోక్‌సభ ఎన్నికల కోసం ఏమీ చేయలేనని తెలిపిన బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి

ఇప్పుడు తన అనారోగ్యం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తాను లోక్‌సభ ఎన్నికల కోసం ఏమీ చేయలేనని, అన్ని విషయాలు ప్రధానికి తెలియజేశానని దానిలో పేర్కొన్నారు.

Sushil Kumar Modi Cancer Diagnosis

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో స్వయంగా తెలియజేశారు. ఇప్పుడు తన అనారోగ్యం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తాను లోక్‌సభ ఎన్నికల కోసం ఏమీ చేయలేనని, అన్ని విషయాలు ప్రధానికి తెలియజేశానని దానిలో పేర్కొన్నారు.

సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన తన 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజ్యసభ, లోక్‌సభ, శాసన మండలి, శాసనసభతో సహా మొత్తం నాలుగు సభలలో సభ్యునిగా కొనసాగారు. ఐదేళ్లపాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు.నాటి ఎమర్జెన్సీ రోజ్లులో 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన వరుసగా 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. తీహార్ జైల్లో కేజ్రీవాల్‌కు ముప్పు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆప్, 4.5 కేజీల బరువు తగ్గారని వెల్లడి

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)