Tamil Nadu Electrocution: తంజావూరులో ఘోర అగ్ని ప్రమాదం, ఆలయ రథం విద్యుత్ తీగకు తగలడంతో 11 మంది సజీవదహనం, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్
షార్ట్‌సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో 11 మంది కాలి బూడిదయ్యారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించామన్నారు.
తమిళనాడులోని తంజావూరులో (Thanjavur) ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కలిమేడు అప్పర్ ఆలయ రథం విద్యుత్ తీగకు తగలడంతో 11 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పర్ గురుపూజై (అయ్యప్పస్వామి పండుగ) సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు రథాన్ని వీధులగుండా గుడికి తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు అది హైటెన్షన్ వైర్లకు తగిలింది. షార్ట్‌సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో 11 మంది కాలి బూడిదయ్యారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించామన్నారు.
అగ్నిప్రమాద ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)