KTR Slams Congress: పార్టీ మారిన ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చిన కేటీఆర్, అతి పెద్ద గొర్రెల కొనుగోలుదారుడిని అందించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అంటూ ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్

మీరు ఒకసారి తెలంగాణ వచ్చి చూస్తే.. ఇక్కడ గొర్రెల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూసి ఆశ్చర్యపోతారని విమర్శించారు

KTR slams CM Revanth revanth reddy govt failures(X)

ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ ఎమ్మెల్యేలను గొర్రెలు కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. మీరు ఒకసారి తెలంగాణ వచ్చి చూస్తే.. ఇక్కడ గొర్రెల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూసి ఆశ్చర్యపోతారని విమర్శించారు. అతి పెద్ద గొర్రెల కొనుగోలుదారుడిని అందించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అంటూ వ్యంగ్యంగా చెప్పారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకున్నారని కేటీఆర్‌ అన్నారు. వాళ్లలో కొందర్ని కొనుగోలు చేశారని.. మరికొందరిని బెదిరించారని తెలిపారు.

కానీ అలా పార్టీ మారిన ఎవరూ కూడా తమ పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో వారికి కూడా తెలియని దయనీయ పరిస్థితి ఉందని విమర్శించారు. వారిని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో నిలబెట్టి దీనిపై అడగాలని ఖర్గేను డిమాండ్‌ చేశారు. వాళ్లందరూ కూడా కోర్టులకు, తమ పదవి పోతుందేమోనని గజగజ వణికిపోతున్నారని తెలిపారు.

వికారాబాద్‌లో అధికారులపై దాడి, 55 మందిని అదుపులోకి తీసుకున్న పొలీసులు, కలెక్టర్‌పై దాడి ఘటనలో కుట్రదారులెవరో విచారణ చేస్తామని తెలిపిన ప్రభుత్వం

కాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. విపక్షాలను అణిచివేసేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ఎమ్మెల్యే గొర్రెలను కొన్నట్లుగా కొంటున్నారని ఆరోపించారు. నలుగురు వ్యక్తులు ( మోదీ, అమిత్‌షా, అదానీ, అంబానీ) నలుగురు కలిసి దేశాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు.

KTR Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు