Terrorist Attack in Jammu and Kashmir: మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఆర్మీ వాహనాలే లక్ష్యంగా కాల్పులు, సమర్ధవంతంగా తిప్పికొట్టిన భారత బలగాలు
కతువా (Kathua) జిల్లాని భర్నోటా గ్రామంలో మరోసారి టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. సోమవారంనాడు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కతువా (Kathua) జిల్లాని భర్నోటా గ్రామంలో మరోసారి టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. సోమవారంనాడు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. తొలుత గ్రనేడ్ విసిరిన టెర్రరిస్టులు ఆ తర్వాత కాల్పులు జరిపిట్టు చెబుతున్నారు. కశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్.. కప్ బోర్డు వెనకున్న రహస్య బంకర్ లో దాక్కున్న ఉగ్రవాదులు.. ఎంతో చాకచక్యంగా నలుగురిని మట్టుబెట్టిన సైనికులు.. ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం.. వీడియో వైరల్
బిల్లావార్ తహసిల్‌లోని లోహైమల్హార్ బ్లాక్ మచ్చేడి ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగింది. వెంటనే అదనపు బలగాలు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలపై టెర్రరిస్టులు దాడి జరపడం గత రెండ్రోజుల్లో ఇది రెండవది. దీనికి ముందు కుల్గాం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లపై ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది.
Here's news
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)