Srinagar, July 8: చల్లని కశ్మీర్ లోని (Kashmir) కుల్గామ్ జిల్లా ఎన్ కౌంటర్ (Encounter) తో శనివారం దద్దరిల్లింది. జవాన్లకు, ముష్కరులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో నలుగురు హిజ్బుల్ ఉగ్రవాదులు హతమయ్యారు. చిన్నిగమ్ ఫ్రిసాల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో దాక్కున్న వారిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇంట్లోని కప్ బోర్డు వెనక భాగంలో ఉన్న రహస్య బంకర్ లో ఉగ్రవాదులు దాక్కున్నారని భద్రతా దళాలు తెలిపాయి. కప్ బోర్డులోపలి నుంచి బంకర్ లోకి రహస్య మార్గం గుర్తించామని పేర్కొన్నాయి. ఉగ్రవాదులకు స్థానికుల సహాయసహకారాలు అందుతున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఉచిత ఇసుక పాలసీ అమలుకు రంగం సిద్ధం, టన్నుకు రూ. 88 వసూలు చేయనున్న ప్రభుత్వం
#Video: 4 Terrorists Killed In J&K Hid In 'Bunker' With Entry From Fake Cupboard
Read Here: https://t.co/evpr2HP0SG pic.twitter.com/5SZj51dmpl
— NDTV (@ndtv) July 8, 2024
ఇద్దరు జవాన్లు కూడా
అత్యంత చాకచక్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో ఇద్దరు భారత ఆర్మీ సైనికులు కూడా అమరులయ్యారు. దక్షిణ కశ్మీర్ లోని కుల్గామ్ లో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో మొత్తం ఆరుగురు హిజ్బుల్ ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు భద్రతా దళాలు పేర్కొన్నాయి. బంకర్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.