Hyderabad, July 06: క‘‘గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో మాట్లాడుకున్నాం. రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు (Telugu States CM's Meet) కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించాం. సీఎస్‌లు, ముగ్గురు అధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తాం. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీని వేయాలని తీర్మానించాం. అక్కడ కూడా పరిష్కారం కాని అంశాలుంటే ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కార మార్గం కనుగొనాలని నిర్ణయించాం. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించాం’’ అని భట్టి విక్రమార్క వెల్లడించారు.
Telugu States CMs Meeting Press Meet https://t.co/5RtQAfFPuV
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 6, 2024
ఏపీ మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు జాతి హర్షించే రోజు అని వ్యాఖ్యానించారు. విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సీఎంలు మందుకు రావడం శుభపరిణామమన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.