Udaipur beheading: టైల‌ర్‌ హత్య ఘటనపై స్పందించిన ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ, ఉద‌య్‌పూర్ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని వెల్లడి

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఓ టైల‌ర్‌ను క్రూరంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న‌పై ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉద‌య్‌పూర్ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు.

Asaduddin Owaisi (Photo-ANI)

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఓ టైల‌ర్‌ను క్రూరంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న‌పై ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉద‌య్‌పూర్ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. ద‌ర్జీని హ‌త్య చేసిన ఇద్ద‌రు నిందితుల‌పై రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపారు. పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉంటే ఈ ఘ‌ట‌న జ‌రిగి ఉండేది కాద‌న్నారు. తీవ్ర‌వాదం బాగా పెరిగిపోతుంద‌న్నారు. నుపుర్ శ‌ర్మ స‌స్పెన్ష‌న్ చేయ‌డం కాదు.. ఆమెను అరెస్టు చేయాల‌ని ఎంపీ ఓవైసీ డిమాండ్ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement