Union Budget 2022: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు నిరాశే, వేతన జీవులకు ఊరట కల్పించే ఏ నిర్ణయం బడ్జెట్‌లో లేదు, అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు రెండు సంవత్సరాలకు పెంపు

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇన్‌కం ట్యాక్స్ బ్రాకెట్లో మార్పులేవీ ప్రతిపాదించలేదు. అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువును రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లు తెలిపారు.

Income Tax Filing (Photo Credits: Pixabay)

2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొత్త వార్తలేవీ లేవు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇన్‌కం ట్యాక్స్ బ్రాకెట్లో మార్పులేవీ ప్రతిపాదించలేదు. అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువును రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లు తెలిపారు. వేతన జీవులకు ఊరట కల్పించే ఏ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ లో ప్రకటించలేదు. దీంతో ఈ సారి కూడా ఆదాయపు పన్ను మినహాయింపులపై ఎన్నో ఆశలను పెట్టుకున్న సగటు ఉద్యోగికి నిరాశే మిగిలింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్సన్ స్కీం) డిడక్షన్ ఉంటుందని నిర్మలా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  ఎన్‌పీఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)