Mock Drill for COVID-19: పెరుగుతున్న కేసులతో ఆందోళన, దేశ వ్యాప్తంగా మాక్‌డ్రిల్స్‌ ప్రారంభం, ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో మాక్ డ్రిల్‌ నిర్వహించిన మన్సుఖ్ మాండవియా

తాజాగా ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో కోవిడ్ 19 సన్నద్ధత కోసం కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాక్ డ్రిల్‌ నిర్వహించారు.

Union Health Minister Mansukh Mandaviya (Photo Credit: ANI)

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ (Corona Virus) వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిన తర్వాత ఇబ్బందులు పడకుండా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఆసుపత్రుల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండు రోజుల పాటు మాక్‌డ్రిల్స్‌ (Mock Drill) నిర్వహించాలని నిర్ణయించింది. తాజాగా ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రిలో కోవిడ్ 19 సన్నద్ధత కోసం కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాక్ డ్రిల్‌ నిర్వహించారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)