US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పోలింగ్‌ మొదలైన కొన్ని గంటలకే తొలి ఫలితం, చెరి సమానంగా ఓట్లు

US Presidential Election 2024: in Dixville Notch, New Hampshire, both Kamala Harris and Donald Trump received three votes each

US 2024 అధ్యక్ష ఎన్నికల కోసం ఈ రోజు ఓటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. పోలింగ్‌ తేదీ (నవంబర్‌ 5) మొదలైన కొన్ని గంటలకే అక్కడి ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూహ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వచ్చేసింది.

అమెరికాలో మొదలైన అధ్యక్ష ఎన్నికల పోలింగ్, అప్పుడే డిక్స్‌విల్లే నాచ్‌ నుంచి తొలి ఫలితం వచ్చేసింది, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయంటే..

అక్కడ మొత్తం ఆరుగురు ఓటర్లు ఉండగా.. డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ (Kamala Harris)కు మూడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు మూడు ఓట్లు వచ్చాయి. 2020లో మాత్రం డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ (Joe Biden) వైపు డిక్స్‌విల్లే నాచ్‌ ఓటర్లు మొగ్గుచూపారు. ఆ ఎన్నికల్లో ఆయనే విజయం సాధించడం విశేషం. కాగా, ఎలక్షన్‌ డే రోజున డిక్స్‌విల్లే నాచ్‌లో అర్ధరాత్రి నుంచే పోలింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశంలోనే తొలి ఫలితం వెలువడే ప్రదేశంగా ఈ కౌంటీ పేరుగాంచింది.

Kamala Harris and Donald Trump received three votes each

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)