UP Fan Meet Allu Arjun: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ కోసం యూపీ నుంచి 1500 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చిన అభిమాని, ఎమోషనల్ అయిన ఐకాన్ స్టార్
యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. అల్లు అర్జున్‌ను కలిసేందుకు సైకిల్‌పై వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప మూవీ తర్వాత వరల్డ్ వైడ్‌గా పెరిగిపోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు సైతం అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానం. ఇక విదేశాల్లోనే అంత క్రేజ్ ఉంటే మనదేశంలో ఏ రేంజ్‌లో ఉంటుందో చూస్తేనే అర్థమవుతోంది. తాజాగా ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు.
పుష్ప-2 ఫస్ట్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ అంటూ దేవిశ్రీప్రసాద్ కామెంట్స్ వైరల్, వీడియో ఇదిగో...
యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని అల్లు అర్జున్‌ను కలిసేందుకు ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు. పుష్ప-2 ప్రమోషన్స్ కోసం యూపీకి వస్తే కచ్చితంగా కలుస్తానని ఐకాన్ స్టార్ అతనితో అన్నారు. తనను కలిసిన అభిమానికి అల్లు అర్జున్ మొక్కను బహుమతిగా ఇచ్చాడు. అతనికి మంచి భోజనం పెట్టించి.. తిరిగి బస్సులో పంపించాలని తన సిబ్బందికి సూచించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Here's Fan Meet Allu Arjun Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)