Uttarakhand: చార్‌ధామ్ దేవస్థానం బోర్డు రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం, గతంలో దేవస్థానం బోర్డు కింద 51 ఆలయాల నిర్వహణ
అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత.. చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం పుస్కర్ సింగ్ ధామి వెల్లడించారు. చార్‌ధామ్ దేవస్థానం బోర్డును 2019లో ఏర్పాటు చేశారు.
ఉత్తరాఖండ్ చార్‌ధామ్ దేవస్థానం బోర్డును పుస్కర్ సింగ్ ధామి ప్రభుత్వం రద్దు చేసింది. అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత.. చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం పుస్కర్ సింగ్ ధామి వెల్లడించారు. చార్‌ధామ్ దేవస్థానం బోర్డును 2019లో ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్డును రద్దు చేయాలని స్థానిక పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయాల సాంప్రదాయ హక్కులు అడ్డుకుంటున్నట్లు వాళ్లు ఆరోపించారు.
దేవస్థానం బోర్డుపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం ధామి ఈ నిర్ణయం తీసుకున్నారు. మనోహర్ కంట్ దయానీ నేతృత్వంలోని బృందం రిపోర్ట్‌ను తయారు చేసింది. దేవస్థానం బోర్డు కింద 51 ఆలయాల నిర్వహణ ఉండేది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రీ ఆలయాలు కూడా ఆ బోర్డు పరిధిలో ఉన్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)