Rent A Boyfriend: రెంట్‌కి బాయ్‌ఫ్రెండ్.. కేవలం రూ.389కే, బెంగుళూరులో ప్రేమికుల రోజు బంపర్ అఫర్ ,సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టర్లు

బెంగుళూరులో ప్రేమికుల రోజు బంపర్ అఫర్ పోస్టర్లు వెలిశాయి . రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. కేవలం రూ.389 లకే బాయ్ ఫ్రెండ్ అంటూ పోస్టర్లలో తెలిపారు .

Valentine's Day bumper offer in Bangalore,Boyfriend for just Rs. 389(X)

బెంగుళూరులో ప్రేమికుల రోజు బంపర్ అఫర్ పోస్టర్లు వెలిశాయి(Rent A Boyfriend). రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. కేవలం రూ.389 లకే బాయ్ ఫ్రెండ్ అంటూ పోస్టర్లలో తెలిపారు(Valentines Day). ఈ పోస్టర్లపై ప్రేమికుల దినోత్సవం ఒక బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోండి, స్కాన్ చేయండి అని రాసుకొచ్చారు. అంతేగాదు QR కోడ్ కూడా ఇచ్చారు. వీటిని జయనగర్, బనశంకరి, BDA కాంప్లెక్సులు వంటి ప్రదేశాల్లో అతికించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ పోస్టర్లపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగుళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ X (ట్విట్టర్)లో ఫిర్యాదు చేశారు. ఇది మన సంస్కృతికి భంగం కలిగించే విషయమని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు(Boyfriend for just Rs. 389 ).

ప్రేమికుల రోజున మాజీ ప్రియుడికి షాకిచ్చిన యువతి.. 100 పిజ్జాలు ఆర్డర్ ఇచ్చి సర్‌ప్రైజ్, కానీ చివరకు! 

అయితే వాస్తవానికి ఇలా వాలెంటైన్స్ డే రోజున పోస్టర్లు వెలియడం ఇదే తొలిసారి కాదు. 2018లో మహారాష్ట్రలోని ముంబైలో "రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్" అనే యాప్ ప్రారంభమైంది. పురుషులకు ఉద్యోగ ప్రకటనలు కూడా ఇచ్చింది.

Valentine's Day bumper offer in Bangalore, Boyfriend for just Rs. 389 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now